TS EAM‌CET 2023 : ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు

తెలంగాణలో ఎంసెట్ ఫలితాల ప్రకటనపై ఎంసెట్ కన్వీనర్ కీలక ప్రకటన చేశారు.

Update: 2023-05-24 04:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎంసెట్ ఫలితాల ప్రకటనపై ఎంసెట్ కన్వీనర్ కీలక ప్రకటన చేశారు. ఎంసెట్ ఫలితాలను మే 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాశారు. అగ్రి కల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12,13, 14న జరిగాయి. ఎంసెట్ ఫలితాల కోసం eamcet.tsche.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

Tags:    

Similar News