వాహనదారులకు అలర్ట్: 9 నుండి 11వ తేదీ వరకు ఆ రూట్లలో ట్రాఫిక్ అంక్షలు

హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు.

Update: 2022-12-06 14:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 10, 11వ తేదీల్లో ఫార్ములా-ఈ కారు రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నందు వలన నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్ రోడ్డు చూట్టూ ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. 

Similar News