నేను గెలిస్తే చేవేళ్ల ప్రజలకు చేసేది ఇదే!.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తాను ఎంపీగా ఉన్నప్పుడు చేవేళ్ల ప్రజలకు ఏం చేశారు.. ఇప్పుడు గెలిస్తే ఏం చెస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-04 07:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తాను ఎంపీగా ఉన్నప్పుడు చేవేళ్ల ప్రజలకు ఏం చేశారు.. ఇప్పుడు గెలిస్తే ఏం చెస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా డిబేట్ పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ ఉండటం వల్ల పెద్దగా చేయ్యడానికి కుదరలేరదని.. అయినా ఆ సమయంలో 1000 కోట్ల బీజాపూర్ హైవేను తీసుకొచ్చానని, తాండూరు రాతి పరిశ్రమకు దీర్ఘాయువు అందించేందుకు జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేందుకు కృషి చేశానని చెప్పుకొచ్చారు.

అలాగే ఇప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే.. కేంద్ర ప్రభుత్వ పథకాలలో కొన్ని పథకాలు మాత్రమే ఇక్కడ అమలు చేస్తున్నారని, ఇంకెన్నో పథకాలు రాష్ట్రంలో అమలు కావట్లేదని చెప్పారు. ఆయుష్మాన్ భారత్, ఫసల్ భీమా పథకాలు ఇక్కడ అమలు కావట్లేదని, వాటి అమలుకు కృషి చేస్తామని, అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం మోసం చేశారని, కానీ నేను రంగారెడ్డి, వికారాబాద్ పరిధిలో అవాస్ యోజన పథకం కింద ఇళ్లు లేని పేదలకు దాదాపు 1 లక్ష ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.

ముద్రా యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 20 వేల నుంచి 20 లక్షల వరకు రుణాలు ఇస్తుందని, వాటిని ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, అవగాహాన లేక రాష్ట్రంలో 10 శాతం కూడా అమలు కావట్లేదని తెలిపారు. తాను వచ్చాక అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముద్రా రుణాలు ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తానని భరోసా ఇచ్చారు. అంతేగాక మసీదుల వద్ద సమాచారం పొందే ముస్లింల నమూనా నుండి సూచనలను తీసుకొని, నేను వ్యక్తిగతంగా వికసిత్ భారత్ ట్రక్కులు మొదలైన వాటి ద్వారా అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తానని, ఇలా అన్ని పథకాలపై ప్రజల్లో అవగాహాన తీసుకొచ్చి వారికి ఉపయోగపడేలా చేస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

Similar News