అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది: ప్రధాని మోడీ

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బీజేపీ అల్లాదుర్గం లో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

Update: 2024-04-30 11:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బీజేపీ అల్లాదుర్గం లో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ పై మోడీ కీలక విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ ఆర్ ట్యాక్స్ ను వసూల్ చేసి ఢిల్లీ కాంగ్రెస్ కు కప్పం కడుతుందని అన్నారు. అలాగే గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుందని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయని అన్నారు. దేశాన్ని దోచుకుంటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న కాంగ్రెస్.. పార్టీ రాష్ట్ర, దేశ ప్రజలపై వారసత్వ పన్ను విధించాలని చూస్తుందని ప్రధాని మోడీ విమర్శించారు. అలాగే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగు చేసిందని.. ఇప్పుడు కాళేశ్వరం అవినీతి కేసును కాంగ్రెస్ పార్టీ అనిచివేసి రెండు పార్టీలు పరస్పరం సహరించుకుంటున్నాయని.. ఇరు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి చూస్తున్నాయని ప్రధాని మోడీ విమర్శల వర్షం కురిపించారు.

Similar News