క్రిస్మస్ సెలవులను భారీగా పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..?

2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్ ను తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు(25 మే శనివారం) విడుదల చేసింది.

Update: 2024-05-25 11:16 GMT

దిశ, వెబ్ డెస్క్: 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్ ను తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు(25 మే శనివారం) విడుదల చేసింది. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం మై 2025 ఏప్రిల్ 23 వరకు పాఠశాలల తరగతులు జరగనున్నాయి. అయితే ఈ విద్యాసంస్థర క్యాలెండర్‌లో తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ సెలవులను భారీగా పెంచింది. గతంలో రెండు రోజుల పాటు క్రిస్మస్ సెలవులను ప్రకటించగా.. తాజా విద్యా సంవత్సరం క్యాలెండర్‌లో డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు గా నిర్ణయించారు. దీంతో ఎన్నడూ లేనివిధంగా ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ప్రకటించడం ఇదే తొలిసారి. అలాగే అలాగే అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రభుత్వం నిర్ణయించింది.

Similar News