HYD : రన్నింగ్ విమానం డోర్ తీసేందుకు యత్నించిన వ్యక్తి..

విమానం ఆకాశంలో ఉండగా డోర్ తీసేందుకు ఓ వ్యక్తి యత్నించడం తీవ్ర కలకలం రేపింది.

Update: 2024-05-24 06:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: విమానం ఆకాశంలో ఉండగా డోర్ తీసేందుకు ఓ వ్యక్తి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు అంతా షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్ గాజుల రామారం ఏరియాకు చెందిన జిమ్ ట్రైనర్ అనిల్ మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి శంషాబాద్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో విమానం ఆకాశంలో ఉండగానే తలుపు తీసేందుకు యత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది భద్రతాదికారులకు కంప్లైంట్ చేశారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అనిల్‌కు సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News