తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు..కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలో ప్రస్తుతం ఏ జిల్లాలో చూసినా ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.

Update: 2024-04-17 14:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలో ప్రస్తుతం ఏ జిల్లాలో చూసినా ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. భానుడు భగభగమంటూ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ సమయంలో ఇంటి నుంచి ఎవరు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఎండలు అధికంగా నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలోని కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట జిల్లాలో వేడి గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కొన్ని జిల్లాల ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబాబాద్, భద్రాది జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. అటు హైదరాబాద్‌ నగరంలోని పలుచోట్ల చిరుజల్లులు కురవడంతో వాతవరణం చల్లబడింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News