కవిత బెయిల్ పిటిషన్ వాయిదా.. ఎలక్షన్స్ వరకు జైల్లోనే!

కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది.

Update: 2024-05-10 06:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 24కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు గత సోమవారం కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ను తిరస్కరించింది. దీంతో కింది కోర్టులో తనకు బెయిల్ కాపోవడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా దీనిని ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో కవిత 2024 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా దూరంగా ఉండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News