తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల టీచర్లను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో బదిలీల ప్రక్రియ చేపట్టనున్నది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల టీచర్లను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ మొదటి వారంలో బదిలీల ప్రక్రియ చేపట్టనున్నది. కాగా, మోడల్ స్కూళ్లకు నియామకం తర్వాత బదిలీలు చేపట్టడం ఇదే మొదటిసారి. 2011లో మోడల్ స్కూళ్లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, 2013 నుంచి 2014 వరకు నియామక ప్రక్రియ కొనసాగింది. ఇంతకాలంగా వీరంతా ఒకేస్థానంలో కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి వీరికి 2019లో సర్వీస్‌రూల్స్ అమలు చేసింది. తమను బదిలీ చేయాలంటూ ఉద్యోగులు కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మోడల్ స్కూల్స్ టీచర్ల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.