Cable bridge: కేబుల్ బ్రిడ్జిపై ఆ పని చేసిన సీఐ.. నెటిజన్స్ ఫైర్ (వీడియో)

గతంలో కేబుల్ బ్రిడ్జిపై బండ్లు ఆపి సెల్ఫీలు దిగడం, బర్త్‌డే పార్టీలు చేసుకోవడం చేసేవారు.

Update: 2024-05-05 11:20 GMT

దిశ వెబ్ డెస్క్: గతంలో కేబుల్ బ్రిడ్జిపై బండ్లు ఆపి సెల్ఫీలు దిగడం, బర్త్‌డే పార్టీలు చేసుకోవడం చేసేవారు. దీనితో కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తి తరచూ ప్రమాదాలు చోటుచేసుకునేవి. ఈ నేపథ్యంలో ఆ ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్‌డే పార్టీలు చేసుకోవడం, బండ్లు ఆపి సెల్ఫీలు దిగడం వంటివి చేయకూడదని ఆధేశాలు జారీ చేశారు.

ఎవరైనా రూల్స్‌కు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలానే రూ.10 వేలు ఫైన్ వేస్తామని తెలిపారు. అయుతే ప్రస్తుతం పోలీసులు పెట్టిన రూల్స్‌ను పోలీసు అధికారి అతిక్రమించారు. రూల్స్‌కు అతిక్రమిస్తూ మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ కేబుల్ బ్రిడ్జిపై బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటులు, గతంలో పోలీసులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇది చూసి నెటిజన్స్ భగ్గుమంటున్నారు. రూల్స్ ఉన్నది సామాన్యులకేనా..? పోలీసులకు రూల్స్ వర్తించవా..? అని ప్రశ్నిస్తున్నారు.   



Similar News