రాష్ట్ర అధ్యక్షుడి మార్పు.. Vijayashanti రియాక్షన్ ఇదే!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై వస్తున్న రూమర్స్‌పై విజయశాంతి స్పందించారు.

Update: 2023-01-09 05:07 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై వస్తున్న రూమర్స్‌పై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ''అరకొర సమాచారాన్ని నమ్మి చిలవలు పలవలు చేసి ప్రచారం చేసేవారికి ఇంతకు మించి చెప్పా్ల్సిందేమీ లేదు. రేపటి విజయం బీజేపీది, ఫలితం తెలంగాణ ప్రజలందరిదీ..'' అని ట్వీట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌పై తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విజయశాంతి మండి పడ్డారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ యుద్ధానికి సిద్ధమేనన్నారు.

Also Read...

ఐటీ ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ 

Tags:    

Similar News