గుర్తు తెలియని మహిళ శవం లభ్యం

చెన్నారావుపేట మండలంలోని సూర్యాపేట తండా దగ్గరలోని ఎస్సారెస్పీ కాలువలో మహిళ మృతదేహం కొట్టుకురావడం కలకలం రేపింది.

Update: 2023-03-27 03:57 GMT

దిశ, నర్సంపేట: చెన్నారావుపేట మండలంలోని సూర్యాపేట తండా దగ్గరలోని ఎస్సారెస్పీ కాలువలో మహిళ మృతదేహం కొట్టుకురావడం కలకలం రేపింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చెన్నారావుపేట ఎస్సై మహేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గీసుగొండ నుండి జల్లి వైపు వెళ్లే ఎస్సారెస్పీ కెనాల్ నెంబర్ 40లో సుమారు 40-45 సంవత్సరాల వయసున్న మహిళ మృతదేహాన్ని స్థానికుల సాయంతో బయటికి తీశారు. స్థానికులు ఎవరూ ఆమెను గుర్తుపట్టడం లేదని పోలీసులు తెలిపారు. ఆకుపచ్చని చీరలో ఉన్న మృతురాలికి సంబంధించిన వివరాలు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని ఎస్సై మహేందర్ కోరారు.

Tags:    

Similar News