మోడీని అందుకే హిట్లర్‌తో పోల్చాను.. అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోడీని హిట్లర్‌తో పోల్చడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-05-07 05:16 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రధాని మోడీని హిట్లర్‌తో పోల్చడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ క్లారిటీ ఇచ్చారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 1930లో యూదులను హిట్లర్ పాలించినట్లే ప్రస్తుతం మన దేశంలో ముస్లింల పరిస్థితి ఉందన్నారు. దీనికి యాంకర్ బదులిస్తూ అంటే గ్యాస్ చాంబర్ లలో ముస్లింలను వేస్తు్న్నారా అని ప్రశ్నించగా.. గ్యాస్ చాంబర్ లాస్ట్ స్టేజ్ అని.. క్రిస్టల్‌నాట్ మూమెంట్ వచ్చిందని.. సినిమాలు తీయడం ప్రారంభించారని.. విద్వేష ప్రసంగాలు ఇలా ఒక పద్ధతిలో దాడి జరిగిందన్నారు. ప్రధాని హిందూ మహిళల మెడలోని మంగళసూత్రాలను ముస్లింలకు ఇచ్చేస్తారని చెబుతున్నారని.. దేశంలోని 17 కోట్ల ముస్లింలను అక్రమ చొరబాటు దారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత మోడీ ఉన్న లేకున్నా దేశం ఉంటుందన్నారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు అని చెబుతున్నారని.. కానీ టీఎఫ్ఆర్ రేటింగ్‌లో ముస్లిం మహిళలు వెనకబడ్డారని స్పష్టం చేశారు. హిట్లర్ సైతం యూధులను జర్మన్లు కాదనేవారని.. ప్రధాని కూడా ముస్లింలందరని అక్రమ చొరబాటు దారులు అంటున్నారని ఫైర్ అయ్యారు. 

Similar News