కరీంనగర్‌లో ఉద్రిక్తత.. హనుమాన్ స్వాములను లాక్కెళ్లిన పోలీస్ వాహనం (వీడియో)

కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలో శనివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలో హనుమాన్ మాలధారులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఓ మతానికి చెందిన వ్యక్తి వచ్చి కత్తితో డ్యాన్స్ చేస్తూ.. ర్యాలీకి అడ్డుపడ్డారు.

Update: 2024-05-26 03:16 GMT

దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలో శనివారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలో హనుమాన్ మాలధారులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఓ మతానికి చెందిన వ్యక్తి వచ్చి కత్తితో డ్యాన్స్ చేస్తూ.. ర్యాలీకి అడ్డుపడ్డారు. దీంతో హనుమాన్ మాల దారులు సదరు వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ర్యాలీని నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ఆగ్రహించిన హనుమాన్ మాలధారులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే హనుమాన్ మాలలో ఉన్న వ్యక్తులను దౌర్జన్యంగా ఎలా అరెస్ట్ చేస్తారని.. అక్కడే ఉన్నవారు పోలీస్ వాహనానికి అడ్డుపడ్డారు. అయినప్పటికీ పోలీసులు అలాగే ముందుకు వెళ్లగా.. ఓ హనుమాన్ మాలధారులు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయిన లెక్కచేయకుండా పోలీసులు అతన్ని అలాగే లాక్కుంటూ అత్యంత వేగంగా ముందుకు సాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే పోలీసుల ప్రవర్తనపై హిందు సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

Full View

Similar News