పుస్తెల తాళ్లు తెగడంలో, మద్యం సేవించడంలో తెలంగాణ మొదటి స్థానం.. : ఈటల

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆకృతి టౌన్ షిప్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ మీట్‌లో ఈటల రాజేందర్ పాల్గొని మోడీని గెలిపించాలని కోరారు.

Update: 2024-05-02 07:48 GMT

దిశ, మేడిపల్లి : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆకృతి టౌన్ షిప్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ మీట్‌లో ఈటల రాజేందర్ పాల్గొని మోడీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని ధరణిని కేసీఆర్ తీసుకువచ్చారని, కానీ ధరణి వల్ల ఎంతో మంది నష్టపోతున్నారన్నారు. తెలంగాణ అన్నింటా మొదటి స్థానంలో ఉందని.. అలాగే పుస్తెలు తెగడంలో కూడా మొదటి స్థానంలో అన్నారు. మద్యం సేవించడంలో కూడా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఒకప్పుడు పండగలకు మాత్రమే తాగేవారని ఇప్పుడు తాగడం రోజువారీ పని అయిపోయిందన్నారు.

దీనిని నివారించాలని అన్నారు. బోడుప్పల్‌లో ఓ కార్పొరేటర్ అపార్ట్‌మెంట్ల మద్యలో వైన్ షాప్ ప్రారంభించారని దానివల్ల అక్కడ నివసిస్తున్నవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతన్నారని తెలిపారు. వారు పలు మార్లు సమస్య తనకు చెప్పుకున్నారని.. కేవలం తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారారన్నారు. ఇది ఎంత దుర్మర్గమైన పని అని విమర్శించారు. బోడుప్పల్‌లో వక్ఫ్ బోర్డు సమస్య ఎవరు అధికారంలో ఉన్న తీర్చలేదన్నారు. వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కరిస్తామని అన్నారు. తను మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలో, హాస్టళ్లల్లో సన్న బియ్యం పెట్టమని జీవో ఇచ్చానని గుర్తు చేశారు.

కరోనా సమయంలో బాధితుల వద్దకు వెళ్ళి వారికి ధైర్యాన్ని కలిపించి ఎందరో ప్రాణాలు కాపాడానని అన్నారు. అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికైనా తెలుసా, దందాల కోసం రాజకీయాలకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఓటు వేస్తేనే పదవి వస్తుందన్నారు. సమాజం చల్లగా ఉంటేనే నాయకులు చల్లగా ఉంటారని అన్నారు. మోడీకి ఓటు ఎందుకు వేయాలో అభినందన్ తల్లిని అడగాలని, మోడీకి ఎందుకు ఓటు వేయాలో ఇస్రో శాస్త్రవేత్తలను అడగాలని, టాయిలెట్లను ఇంటింటికి కట్టించి వాటిని ఉపయోగిస్తున్న మహిళలను అడగాలన్నారు.

కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేయించి వ్యాక్సిన్ ను ఉంచితంగా ఎవరెవరు వేయించుకున్నారో వారిని అడగాలి మోడీకి ఎందుకు ఓటు వేయాలో అని అన్నారు. 16 ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్సిట్యూట్‌లు ప్రారంభించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. 5 వ అతి పెద్ద ఆర్దిక వ్యవస్థను 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తా అంటున్న మోడీని మనం గెలిపించాలన్నాు. అలాగే 10 సంత్సరాలలో ఎక్కడైనా మోడీ తలదించుకునే పని చేశారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టౌన్ షిప్ వాసులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

Read More..

కోమటిరెడ్డి రాజగోపాల్ హోంగార్డు కూడా కాలేడు: BJP MP అభ్యర్థి 

Tags:    

Similar News