ఇంటర్ అడ్మిషన్లపై తప్పుడు కథనాలు.. తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి హెచ్చరిక

ఇంటర్మీడియట్ విద్యలో అడ్మిషన్లపై జరుగుతున్న తప్పుడు కథనాలపై తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నాయకులు స్పందించారు.

Update: 2023-07-12 16:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మీడియట్ విద్యలో అడ్మిషన్లపై జరుగుతున్న తప్పుడు కథనాలపై తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నాయకులు స్పందించారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదనేది అవాస్తవమని సంఘం కన్వీనర్ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పుడు కథనాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని ఆయన సూచించారు.

ఇంటర్మీడియట్ బోర్డును, అధికారులను, ప్రభుత్వాన్ని, అధ్యాపకులను బద్నాం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల అడ్మిషన్ల విషయంలో ఆధారాలందిస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News