Son of BJP leader passed away: ప్రముఖ బీజేపీ నేత కుమారుడు అనుమానాస్పద మృతి..

షాద్‌నగర్ బీజేపీ నేత దివంగత కృష్ట కుమారుడు అర్వింద్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.

Update: 2024-05-24 05:34 GMT

దిశ వెబ్ డెస్క్: షాద్‌నగర్ బీజేపీ నేత దివంగత కృష్ట కుమారుడు అర్వింద్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన బీజేపీ నేత దివంగత కృష్ట కుమారుడు అరటి అర్వింద్ యాదవ్ (30) ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి స్వదేశానికి వచ్చేందుకు గత సోమవారం ఏర్పాట్లు సైతం అర్వింద్ చేసుకున్నారు.

కాగా 5 రోజుల క్రితం తన కారును వాష్ చేయించుకుని వస్తాను అని ఇంట్లో చెప్పి వెళ్లిన అర్వింద్ తిరిగిరాలేదు. దీనితో కుటుంబం సబ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబం సబ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సముద్రంలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. కాగా ఆ మృతదేహం అర్వింద్‌గా గుర్తించారు. కాగా ప్రస్తుతం అర్వింద్‌ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి బంధువులు ఆస్ట్రేలియా వెళ్లారు.

Similar News