ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహం.. వీహెచ్ కీలక నిర్ణయం

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్కొన్నారు.

Update: 2024-05-25 15:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తాను సొంత నిధులతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. ఆగస్టు 20న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా లాంచింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో తానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు ఉప్పల్ స్టేడియంకు పెట్టాలని సలహా ఇచ్చానని గుర్తు చేశారు. స్టేడియం నిర్మాణం కోసం కొంత డబ్బులు తక్కువ పడితే కూడా సోనియా గాంధీ వద్దకు తీసుకు వెళ్లి కలిపించానన్నారు.

ఇతరుల పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా, రాజశేఖర్ రెడ్డి కూడా రాజీవ్ గాంధీ పేరు పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. పేరు పెట్టినా, ఇప్పటి వరకు విగ్రహం లేదని, అందుకే ఏర్పాటుకు తానే చొరవ చూపుతున్నానని వెల్లడించారు. అమలాపురంలో 13 అడుగుల ఎత్తు, వెయ్యి కిలోల బరువు, బ్రాన్జ్‌తో రాజీవ్ గాంధీ విగ్రహం రెడీ అయిందన్నారు. అంబేద్కర్ సన్మానించిన శ్రీనాథ్ వడియర్ శిల్పి ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు చెక్కారని, ఆయన వరసుడు రాజ్ కుమార్ వడియర్‌తో రాజీవ్ గాంధీ విగ్రహం చేయించినట్లు వీహెచ్ స్పష్టం చేశారు.

Similar News