రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2024-04-17 08:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. యుగయుగాలకు తరగని వ్యక్తిత్వం, ఈ జాన పరిపాలనకు ఆదర్శం మన శ్రీరామచంద్రమూర్తి జీవితం. జయ జానకి నాయకుడి కల్యాణ వైభోగం సందర్భంగా రామభక్తులకు, రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రికి వెళ్లడం కుదరలేదని తెలుస్తుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేరళ, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లారు.

Similar News