బిగ్ బ్రేకింగ్: SI, కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యుర్థులకు బిగ్ అలర్ట్. ఎపపుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలు రానే వచ్చాయి. కాసేపటి క్రితమే కానిస్టేబుల్, ఎస్ఐ తుది రాతపరీక్ష ఫలితాలను టీఎస్ ఎల్ పీఆర్‌బీ విడుదల చేసింది. సివిల్, ట్రాన్స్ పోర్ట్

Update: 2023-05-30 12:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసు నియామక తుది రాత పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84 శాతం మంది అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. సివిల్, ట్రాన్స్‌పోర్ట్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది, ఐటీ అండ్ కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 4564మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్‌ ఎస్‌ఐ పోస్టులకు 43,708 మంది, ఐటీ అండ్ కమ్యుూనికేషన్‌ ఎస్‌ఐ పోస్టులకు 729 మంది, డ్రైవర్, ఆపరేట్ కానిస్టేబుల్‌ పోస్టులకు 1779 మంది, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ పోస్టులకు 1,153 మంది, పోలిస్‌ ట్రాన్స్‌పోర్ట్ ఎస్ఐ పోస్టులకు 463 మంది, కానిస్టేబుల్ మెకానిక్‌ పోస్టులకు 238 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్ సైట్లో మంగళవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News