ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. కవితను తప్పించేందుకు ఆనాడే భారీ స్కెచ్!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి.

Update: 2024-05-27 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. రాధాకిషన్‌రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్‌లో మరోసారి సంచలన విషయాలు బయటపడ్డాయి. గతంలో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. మధ్యవర్తి నందు ఫోన్లు ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చినట్లు తేలింది. ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో డివైజ్‌లను కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డితో పాటు కొంత మంది బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే బీఎల్ సంతోష్‌ను అడ్డం పెట్టుకుని లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించాలని ప్లాన్ వేసినట్లు తెలిసింది. పైలెట్ రోహిత్ రెడ్డి ఆడియోలను ముందు పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు బీఆర్ఎస్ తెర దించినట్లు తేలింది. బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆనాడు కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా వెలుగు చూసిన అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. 

Similar News