తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకంపై నిషేధం

తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకంను నిషేదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2024-05-26 07:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అదికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం దృష్టి పెట్టి.. వచ్చి రాగానే ఆరోగ్య శ్రీ సేవల విలువను 10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే అలాగే యువతపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలోనే తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకంను నిషేదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేశారు.

ఆ ఉత్తర్వులో.. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30 లోని సబ్-సెక్షన్ (2)లోని క్లాజ్ (a) కింద అందించబడిన అధికారాలను అమలు చేయడంలో 2,3,4 ఆహార భద్రత, ప్రమాణాలు (అమ్మకాలపై నిషేధం, పరిమితి) రెగ్యులేషన్ 2011 ప్రజారోగ్య దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, పొగాకు,నికోటిన్‌లను పొగాకు/ పౌచ్‌లు/ ప్యాకేజీ/ కంటెయినర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా/పాన్‌మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించిబడింది. ఈ నిషేధం 24 మే 2024 నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

Similar News