ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Update: 2024-05-27 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. స్వార్థం కోసం ఎవరు ఫోన్ ఎవరూ ట్యాప్ చేసిన తప్పేనని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత లాభాల కోసం ఎవరైన ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే వాళ్లు కచ్చితంగా శిక్షార్హులేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై రాజకీయ స్వార్థం కోసం అసత్య ప్రచారం చేసినా తప్పేనని అన్నారు. ఈ కేసుపై విచారణ జరుపుతోన్న పోలీసులు.. తప్పు రుజువైతే చర్యలు తీసుకోవచ్చాన్నారు.

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేశారు. నిందితుల కాన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సుప్రీం ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News