అమిత్ షాకు రాష్ట్రంలో ఇల్లు.. ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-05-31 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శంషాబాద్‌లో అమిత్ షాకు ఇల్లు ఉందని అసదుద్దీన్ బాంబు పేల్చారు. ఓ బడా వ్యాపారి అమిత్ షా కోసం ఇల్లు కట్టించారని అసద్ అన్నారు. నెలలో అమిత్ షా కొన్ని రోజులు ఇక్కడే ఉంటారన్నారు. తెలంగాణ సర్కారు అప్రమత్తంగా ఉండాలన్నారు. లేదంటే నష్టపోయేది మేరే అని బీఆర్ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. అమిత్ షా ఇక్కడే ఉండి తెలంగాణపై ఫోకస్ పెడతారన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ నా చేతుల్లో ఉంటే పాత బస్తీలో ఎంతో అభివృద్ధి జరిగేదన్నారు. మెట్రోతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవన్నారు. ముస్లిం సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే బీజేపీలో ఒక్క ముస్లిం ఎంపీ లేడన్నారు. నా పోరాటం రేపటి కోసమని అసదుద్దీన్ అన్నారు.  

Tags:    

Similar News