బ్రేకింగ్: పాలకుర్తికి బండి సంజయ్ తరలింపు

టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ని పోలీసులు నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-04-05 06:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ని పోలీసులు నిన్న అర్ధరాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడి నుంచి బొమ్మల రామారం పీఎస్ కు తరలించారు. అక్కడి నుంచి ఉదయం బండి సంజయ్ ని తరలించిన పోలీసులు తాజాగా ఆయనకు వైద్య పరీక్షలు చేయించేందుకు పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బండి సంజయ్ కి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు. వైద్య పరీక్షల అనంతరం హన్మకొండ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు బండి సంజయ్ ను హాజరు పరచనున్నారు.

Tags:    

Similar News