మానవత్వం చాటిన జేసీబీ డ్రైవర్.. అభినందించిన సజ్జనార్ (వీడియో)

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు.

Update: 2023-03-25 09:31 GMT

 దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ జాగ్రత్తలు చెప్పడం, అవగాహనం కల్పించడం వంటివి చేస్తుంటారు. అంతేకాకుండా ఆయన డిపార్ట్ మెంట్‌కు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్న సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే వెంటనే స్పందిస్తారు. ఇదిలా ఉంటే సజ్జనార్ తాజాగా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగా ఆకట్టుకుట్టుంది. ఈ వీడియోలో ఓ కుక్క పెద్ద గుంతలో పడిపోగా అక్కడే పనిచేస్తోన్న ఓ జేసీబీ డ్రైవర్ గమనించి.. ఆ శునకాన్ని జాగ్రత్తగా గుంత నుండి బయటకు తీసి కాపాడుతాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సజ్జనార్ ‘‘ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన మానవత్వం’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Tags:    

Similar News