రైతుబంధు సొమ్ము కాంట్రాక్టర్ల జేబుల్లోకి? సీఎం సమాధానం చెప్పాల్సిందే

రైతు బంధు నిధులపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా సోమవారం ఆసక్తికర పోస్ట్ చేసింది.

Update: 2024-04-29 08:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు బంధు నిధులపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా సోమవారం ఆసక్తికర పోస్ట్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కోసం కేటాయించిన రూ. 7 వేల కోట్లు ఎటు పోయినయి? అని ప్రశ్నించింది. రైతులకు అందాల్సిన డబ్బు కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయిందా? అని నిలదీసింది.

ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి రైతుబంధు పంపిణీని అడ్డుకున్న కాంగ్రెస్, పంటకాలం పూర్తయినా కూడా.. ఇంకా రైతులందరికి పెట్టుబడి సాయం అందలేదని పేర్కొంది. రైతు బంధు సొమ్ము ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. పూటకో మాట రోజుకో అబద్ధం చెప్తూ రైతుబంధు ఎగబెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చింది.

Tags:    

Similar News