రూ.వెయ్యి నోటు ముద్రణ.. ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ!

రూ.2వేల నోట్ల చలామణి రద్దుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-05-22 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రూ.2వేల నోట్ల చలామణి రద్దుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2వేల నోట్ల లక్ష్యం నెరవేరిందని, అందుకే వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలకు త్వరగా డబ్బులు అందాలని చూశామన్నారు. అందుకే రూ.2వేల నోట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. సెప్టెంబర్ 30 లోపు రూ.2వేల నోట్లు వెనక్కి వస్తాయని అనుకుంటున్నామన్నారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రూ.2వేల నోట్ల స్థానంలో ప్రజలకు అందుబాటులో సరిపడా ఇతర నోట్లు ఉన్నాయన్నారు. వెయ్యి రూపాయల నోట్ తీసుకొచ్చే ఆలోచన లేదన్నారు. రూ.2వేల నోట్లో భద్రతా లోపాలు లేవన్నారు. సెప్టెంబర్ 30 తర్వాత ఏం అవుతుందో చెప్పలేమన్నారు. రూ.2వేల ఉపసంహరణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదన్నారు. బ్యాంక్ డిపాజిట్లలో ఆర్బీఐ జోక్యం చేసుకోదన్నారు. ఇతర ఏజెన్సీలతో మాకు సంబంధం లేదన్నారు. 

Read More:  రూ.2000 నోట్ల మార్పిడికి ఎస్‌బీఐ కీ ఇన్‌స్ట్రక్షన్స్

చాలా సమయం ఉన్నా బ్యాంకులకు పరుగెత్తడానికి కారణం లేదు: RBI గవర్నర్ 

2 వేల నోట్ల డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త నిబంధన.. రూ. 50 వేలు మించితే..

Tags:    

Similar News