తెలంగాణ పోలీసులకు RSP సవాల్.. MLA గాదరి కిషోర్‌పై సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2022-09-04 11:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్ శాఖ అధికారిపై పరుష పదజాలం వాడారు. అధికారిపై నోరు పారేసుకోవడంతో అక్కడికి ప్రజలంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. తాజాగా.. ఈ వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ''వీళ్లు ఎమ్మెల్యేలా లేక కేసీఆర్, టీఆర్ఎస్ మాఫియా ముఠాలో గూండాలా? పింఛన్‌ల డబ్బు ఏమైనా మీ అయ్యల సొత్తా? పోలీసులకు ధమ్ముంటే ఈ ఎమ్మెల్యే మీద 353 IPC కింద సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. తెలంగాణ ప్రజలారా, రాబోయే ఎలక్షన్ల ఎవరి లాగులు మనం పలగొట్టాల్నో మీ కిప్పటికే అర్థం అయ్యిందనుకుంటున్నా.'' అంటూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేపై మండిపడ్డారు.

Tags:    

Similar News