తెలంగాణలో రాబోయేది సోనియమ్మ రాజ్యమే: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Rewanth Reddy criticized the KCR government

Update: 2022-01-29 12:41 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తుల సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపవలసిన సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజలు ఇష్టపడి ఎంచుకున్న ప్రభుత్వం, ప్రజల మరణానికి కారణం అవుతుందన్నారు. మిర్చి పంట మొత్తం దెబ్బతిన్నా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొవటం లేదన్నారు. మిర్చి రైతులకు భరోసా ఇవ్వకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీలు కలిసి 317 జీవో తీసుకువచ్చి ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నాయన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రభుత్వం 317 జీవో తీసుకువచ్చిందన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ సోనియమ్మ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి, వెం నరేందర్ రెడ్డి, నూనావత్ రాధ, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వివిధ మండలాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News