‘నా ఊరికొచ్చి నన్నే బెదిరిస్తావా?.. ఖబర్దార్ మోడీ’ ప్రధాన మంత్రిపై మరోసారి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గాటుగా రియాక్ట్ అయ్యారు.

Update: 2024-05-01 10:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:రిజర్వేషన్లు రద్దు చేయొద్దని, రాజ్యాంగాన్ని మార్చవద్దని అడిగినందుకు మోడీ, అమిత్ షా నాపై కేసు పెట్టారని, ఢిల్లీ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని న్ను హుకుం జారీ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్లలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు, ఫేక్ వీడియో అంశాలపై నిన్న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ' ఈ తెలంగాణ నా ఊరు, నా ప్రాంతం.. నా రాష్ట్రానికి వచ్చి, నా రాష్ట్రం నడి గడ్డపై నిల్చుని నన్నే బెదిరిస్తావా? ఈ రాష్ట్రా సీఎంనే మోడీ బెదిరిస్తున్నావంటే తెలంగాణ సమజాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. మీరు భయపెడితే బయపడటానికి ఇక్కడా ఎవరూ అమాయకులు లేరు. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ గడ్డపై బెదిరిద్దామని అనుకుంటున్నారేమో ఖబర్దార్ ప్రధాన మంత్రి. 20 ఏళ్లుగా ఎన్నో చూశాను. మీరు పెట్టే కేసులకు రేవంత్ రెడ్డి భయపడతాడా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయాందోళనలకు గురి చేస్తూ రాజ్యాధికారం చేయాలంటే నిజాం నవాబులకు ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుందని హెచ్చరించారు. దమ్ముంటే మీరు తెలంగాణకు చేసిన అభివృద్ధిని చెప్పుకుని ఓట్లు అడగాలన్నారు. ఈ ఎన్నికలు గుజరాత్ ఆధిపత్యానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పదేండ్లలో ఈ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని నిన్న మోడీ తెలంగాణ వచ్చి మన మరోసారి గాడిద గుడ్డు తెచ్చాడని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే మోడీ 400 సీట్లు అడుగుతున్నారని మీరు ఎన్ని కుట్రలు చేసినా కుదరదని మీ కుట్రలను తిప్పి కొడతామని హెచ్చరించారు. ఢిల్లీ పోలీసులను ఉపయోగించాలని మనల్ని భయపెట్టాలని చూస్తున్నారుని ఇక్కడ మీ ఎంపీలు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు.

సా.5 గంటలకు ఆధారాలతో సహా వివరిస్తా:

ఈసారి జరగబోయే లోక్ సభ ఎన్నికలు ఆశామాషి ఎన్నికలు కావన్నారు. గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఎన్నో ప్రత్యేకమైన పరిస్థితుల దేశంలో నెలకొన్నాయని బీజేపీ 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈ దేశాన్ని అదాని, అంబానీలకు అమ్మేయాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నానని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను ఏ విధంగా దెబ్బతీయాలని బీజేపీ అనుకున్నదో ఆధారాలతో సహా వివరిస్తానన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆయన స్థాయికి హోదాకు ఇది తగదన్నారు. 2000 సంవత్సరంలోనే బీజేపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఆనాడు రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించిందని ఈ వివరాలన్ని బయటపెడతాన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఎంతో మంది మేధావులను కలిసి మాట్లాడి కులగణన అంశంపై నిర్ణయం తీసుకున్నారన్నారు. సామజిక స్పృహ తో సామజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే బీసీ కులగణన చేపడతామని అధికారం ఇవ్వాలని కోరితే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబం నుండి ప్రజలు విముక్తి కల్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులు గిరిజనులు మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఆదుకుంటే వాటిని బీజేపీ విచ్ఛిన్నం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News