జేడీఎస్ ఓటమితో సీఎం కేసీఆర్ కూడా ఓడిపోయినట్లే: రేవంత్ రెడ్డి

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-05-13 07:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఫలితంగానే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని అన్నారు. కేసీఆర్ మద్దతిచ్చిన జేడీఎస్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని.. జేడీఎస్ ఓటమితో సీఎం కేసీఆర్ కూడా ఓడిపోయినట్లేనని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ కుట్రలను కన్నడిగులు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం 130 స్థానాల్లో లీడ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తోంది. 

Also Read...

కర్నాటక రిజల్ట్స్: కర్నాటక కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ కీలక ఆదేశం

Tags:    

Similar News