ఏ ప్రభుత్వమైనా సరే మీ సమస్య కోసం నేను ముందుంటా : సబితా ఇంద్రారెడ్డి

మీ కాలనీలలో ఏ సమస్య ఉన్న నేను 24 /7 మీకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Update: 2024-05-26 12:16 GMT

దిశ, సరూర్ నగర్ : మీ కాలనీలలో ఏ సమస్య ఉన్న నేను 24 /7 మీకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్ డివిజన్ లోని పోచమ్మ బాగ్ నార్త్ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని వారితో సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహేశ్వరం నియోజకవర్గానికి నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. అదే విధంగా ఏ ప్రభుత్వం ఉన్నా మీ కాలనీలలో ఏ చిన్న సమస్య వచ్చినా నేను ముందుంటానని, మీకు ఇంకా ఏ సమస్యలున్నా అన్నిటిని కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సరూర్నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేశ్వరం నియోజకవర్గ యూత్ వింగ్ మాజీ అధ్యక్షులు లోకసాని కొండల్ రెడ్డి,సరూర్నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు అంకిరెడ్డి, ఆకుల అరవింద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుశీలా రెడ్డి, కేశవరెడ్డి, ఇస్మాయిల్, గౌని శ్రీనివాస్ గౌడ్, వుత్తుపల్లి శ్రీనివాస్, రాజేష్ గౌడ్, సందీప్ రిషి, గోవర్ధన్ రెడ్డి, ప్రత్యుష్, ఆకుల అరుణ్ కుమార్, శేఖర్ రెడ్డి, గుండె నాగరాజు, పందుల రాజు, సాధిక్, జహీర్, సాజిద్, కిరణ్, గుఫ్రాన్, రాకేష్, సాయి,సాలమ్మ, భాగ్య, మహేశ్వరీ,మంగ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు మోహనా చారి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కోశాధికారి శివ శంకర్ పోచమ్మ భాగ్ కాలనీవాసులు పాల్గొన్నారు.

Similar News