తెలంగాణ రాకతో కేసీఆర్ కుటుంబమే లాభ పడింది : శంషాబాద్ నిరుద్యోగ జేఏసీ

తెలంగాణ రాకతో కేసీఆర్ కుటుంబం లాభ పడి నిరుద్యోగులు మాత్రం రోడ్డున పడ్డారని శంషాబాద్ నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు.

Update: 2022-12-09 13:29 GMT

దిశ, శంషాబాద్ : తెలంగాణ రాకతో కేసీఆర్ కుటుంబం లాభ పడి నిరుద్యోగులు మాత్రం రోడ్డున పడ్డారని శంషాబాద్ నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించక పోగా నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వడంలేదని వారు వాపోయారు. ఈ మేరకు శంషాబాద్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శంషాబాద్ నిరుద్యోగ జేఏసీ ర్యాలీకి బీజేవైఎం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడితే తెచ్చుకున్న తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయి.

కానీ నిరుద్యోగులకు మాత్రం ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదన్నారు. పేరుకే లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నాను అని చెప్పి, దాన్ని కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటివరకు నిరుద్యోగ భృతి కల్పించలేదన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్రమత్తు వదిలి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు గోవర్ధన్, సురేష్, అశోక్, మహేష్, పవన్ గౌడ్, ప్రదీప్ చారి, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News