పుల్వామా అమరవీరులకు ఘననివాళులు..

కొడంగల్ పట్టణంలో నవీన ఆదర్శ ప్లై & హై స్కూల్ పుల్వామా అమరవీరుల దినోత్సవం నిర్వహించారు.

Update: 2023-02-14 14:58 GMT

దిశ, కొడంగల్ : కొడంగల్ పట్టణంలో నవీన ఆదర్శ ప్లై & హై స్కూల్ పుల్వామా అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన అమర ఆర్మీ జవాన్లకు ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. ముందుగా పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన 42 మంది అమర జవాన్ల ఫోటోలకు పూలమాలవేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డీవీ.నరేష్ రాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు పుల్వామా ఘటన గురించి వివరించారు. పుల్వామాఘటన 14 ఫిబ్రవరి 2019లో జరిగిందని వివరించారు.

ఈ ఘటనలో మన దేశానికి చెందిన ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారని వారికి ఘనంగా నివాళులర్పించి వారి ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళిఅర్పించారు. అలాగే అంబేద్కర్ చౌరస్తాలో పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన 42మంది ఆర్మీ జవాన్లకు ఘననివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సంతోష, ఉపాధ్యాయులు రాజు మల్లికార్జున, రమాదేవి, పరానా నాగేంద్రమ్మ, శకుంతల, మిరాజ్ బేగం, అనురాధ, అరుణ, సంతోషి అమ్మానాన్న ఆర్గనైజేషన్ సభ్యులు ప్రవీణ్, అనిల్ కుమార్, స్కూల్ ఫౌండర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News