ఈదురుగాలుల బీభత్సం…

దుద్యాల, బొంరాస్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం బలమైన ఈదురు గాలులకు చెట్లు,విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

Update: 2024-05-26 13:05 GMT

దిశ బొంరాస్ పేట్ :- దుద్యాల, బొంరాస్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం బలమైన ఈదురు గాలులకు చెట్లు,విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దుద్యాల మండలంలోని పోలేపల్లి,పల్లె గడ్డ,హకింపేట్,ఈర్లపల్లి, లగచర్ల గ్రామాలలో బలమైన ఈదురు గాలులుతో కూడిన వర్షం కురిసింది. పదుల సంఖ్యలో చెట్లు విరిగి రోడ్లపై పడడంతో,కొద్దిసేపు రవాణాకు అంతరాయం ఏర్పడింది. పోలేపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం ముందు భాగంలో ఉన్న ధ్వజస్తంభ శిఖరం విరిగింది.రేకుల షెడ్డు లేచిపోయింది.పల్లెగడ్డలో చెట్టు విరిగి,వైర్లపై పడడంతో,రెండు స్తంభాలు నేలకొరిగాయి. తుంకిమెట్ల గ్రామంలో చెట్టు విరిగి, బ్యాగరి శివ ఇంటిపై పడటంతో,రేకులు కూలి,ఇంట్లో ఉన్న వస్తువులు దెబ్బతిన్నాయి.

Similar News