అది ఓ దత్తత గ్రామంలో సమస్యలు.. పట్టించుకోని సర్పంచ్

Update: 2022-02-12 08:46 GMT

దిశ, షాబాద్ : అది ఒక ఎమ్మెల్యే దత్తత గ్రామం అక్కడ అభివృద్ధి మాట పక్కన పెడితే కనీస మౌలిక వసతులు లేక గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామ యువకులు పలుమార్లు గ్రామ సభలకు వెళ్లి గోడు వినిపించుకున్నా ఫలితం శూన్యం. వివరాల్లోకి వెళితే.. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల పరిధిలో రేగాడి దోసడా గ్రామంలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో తరుచుగా సమస్యలు ఎదుర్కోవలసిన దుర్భర స్థితి ఏర్పడింది. డ్రైనేజీ దుర్వాసనతో తిండి కూడా తినలేక పోతున్నామరి గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇదంతా జరుగుతోంది అధికార పార్టీ ఎమ్మెల్యే కాలే యాదయ్య దత్తత గ్రామంలో కావడం గమనించదగ్గ విషయం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

1). లాలగన్ రవి(గ్రామ యువకుడు )

మా గ్రామం ఎమ్మెల్యే కాలే యాదయ్య దత్తత గ్రామం అయినా ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కనీసం డ్రైనేజీ సమస్యలైనా పరిష్కారించాలని కోరుతున్నాం.

2). సత్యంబాబు (కాంగ్రెస్ పార్టీ మండల్ కార్యదర్శి )

గ్రామంలో సమస్యలను త్వరగా పరిష్కరించాలి. డ్రైనేజీ దుర్వాసనతో తిండి కూడా తినలేకపోతున్నాం. గ్రామ సభలో సమస్య తీర్మానం చేసినా ఫలితం లేదు.

Tags:    

Similar News