కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ : రోహిత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు మాజీ

Update: 2024-04-29 10:20 GMT

దిశ,బషీరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని బషీరాబాద్ మండల పరిధిలోని ఏకాంబరి శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీళ్లపల్లి, మైల్వార్,దామర్ చెడ్ గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని పైలెట్ కోరారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని,కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలని కోరారు.

తెలిసి తెలియక చీకటి రోజులు తెచ్చుకున్నాం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని, కేసీఆర్ ప్రభుత్వం పడిపోగానే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని , కనీసం ఇంటి ఇంటికి తాగునీరు ఇవ్వడం కూడా చేతకానిది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే 6 గ్యారెంటీల పై నిలదీయాలన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్ని తెలిపారు. కొండా ఎవరిని దగ్గరకు కూడా రానీయడు అని, తాండూరులో పదిమందిని కూడా గుర్తు పట్టడు అని కొండాను కలవాలంటే ప్రజలకు కొండంత కష్టం అని అన్నారు. తాండూరుకు రమ్మని పిలిచినా రాని రంజిత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి మీ ఓటు వృథా చేసుకోవద్దని రోహిత్ రెడ్డి అన్నారు.

కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు సికిందర్ ఖాన్, రుక్మారెడ్డి, అనంతయ్య, పాండురంగా రెడ్డి, అశోక్ గౌతమ్, రాజురెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, మధు గౌడ్, హన్మంత్ రెడ్డి, వెంకటయ్య, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News