రుణమాఫీ చేయకుంటే రాజీనామాకు సిద్ధమా : రోహిత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కొట్ పల్లి లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Update: 2024-05-04 16:09 GMT

దిశ, కోట్ పల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కొట్ పల్లి లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మళ్లీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి అందాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలని అన్నారు. పదేళ్లుగా బిజెపి చేసింది శూన్యమని అన్నారు.

బిజెపి నాయకులు ఓట్లు అడగడానికి వస్తే గ్రామాలలో మీరు చేసిన అభివృద్ధి ఏది అని ప్రశ్నించాలని కోరారు. బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి వ్యాపారాలు డబ్బులు సంపాదించడం తప్ప ప్రజాసేవ చేయాలనే తపన లేదని, తాను దగ్గరుండి కొన్ని సంవత్సరాలు చూశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కానీ వాగ్దానాలు ఇచ్చి అధికారం చేజిక్కించుకుని ప్రజలకు మోసం చేసిందని తెలిపారు.

ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు గెలిపించుకొని కేసీఆర్ కు మద్దతు తెలపాలని కోరారు. ఆగస్టు 15 నాడు రుణమాఫీ చెయ్యకుంటే తాండూర్ ప్రస్తుత ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే కరెంట్ కోతలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాములు మాజీ సర్పంచ్ లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్, కోటపల్లి మండల నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Similar News