దేవునిపడకల్ లో ఘనంగా గరుడసేవ

మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Update: 2024-03-27 16:18 GMT

దిశ, తలకొండపల్లి : మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి గరుడసేవ, ఎదుర్కోళ్లు, మంగళ హారతులు వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్వర స్వామి సత్యభామ రుక్మిణి సమేత కళ్యాణ

    మహోత్సవ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త లట్టుపల్లి రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు. కళ్యాణాన్ని తిలకించడానికి ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాడెమోని శ్రీశైలం, మాజీ ఉపసర్పంచ్ రాజమౌని తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుమ్మరి శంకర్, బిచ్చ నాయక్, ఆంజనేయులు, శ్రీనివాసులు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. 

Similar News