ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఏర్పాటు..

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్ట్‌లు గురువారం ఎల్బీనగర్‌లో సమావేశం అయ్యారు.

Update: 2023-05-18 16:13 GMT

దిశ, ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్ట్‌లు గురువారం ఎల్బీనగర్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టు జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజల సమస్యలను అధికారుల, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఈ సమావేశంలో జేఏసీ తీర్మానించింది. అన్ని నియోజకవర్గాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు ఇస్తున్న మాదిరిగానే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి వినతి పత్రం అందజేయాలని జేఏసీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్ణయం తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించనునట్లు జేఏసీ నాయకులు, జర్నలిస్టులు వెల్లడించారు.

Tags:    

Similar News