సమస్యలను వెంటనే పరిష్కరించండి

సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

Update: 2024-05-22 10:57 GMT

దిశ, సరూర్ నగర్ : సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో హరిపురి కాలనీ, జానప్రియ గార్డెన్, సరోజినీనగర్ కాలనీలలో బుధవారం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అస్తవ్యస్థమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అధికారులు, కాలనీవాసులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకొని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కాలనీ కి వచ్చిన సబితకు ఆయా కాలనీ

    సంక్షేమ సంఘం ప్రతినిధులు కాలనీలలో పలు సమస్య లను ఏకరువు పెట్టారు. దాంతో ఆమె వెంటనే పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హరిపురి కాలనీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, జానప్రియ గార్డెన్ అధ్యక్షుడు పర్వత రెడ్డి, సరోజినీ నగర్ అధ్యక్షుడు భూపాలరెడ్డి, జీహెచ్​ఎంసీ ఏఈ ఈశ్వర్, వాటర్ వార్క్స్ ఏఈ రామకృష్ణ రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకులు మురుకుంట్ల అరవింద్, పెండ్యాల నగేష్, సాజీద్, గొడుగు శ్రీనివాస్, నెలకొండ శ్రీనివాస్ రెడ్డి, రాంనర్సింహా గౌడ్, కంచర్ల శేఖర్, వెంకటేష్ గౌడ్, మహేందర్ రెడ్డి, మురళీదార్ రెడ్డి, నవీన్, శంకర్ నాయక్, రమేష్, లిక్కి ఊర్మిళ, సునీతా పటేల్, కల్పనా, రేవతి, హైమ, రోజా పాల్గొన్నారు. 

Similar News