త్రాగు నీరు వృధా..తప్పని వ్యధ

మండుటెండలతో చెరువు, కుంటలు ఎండిపోతూ… నేలలు నెర్రెలు బారి భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి.

Update: 2024-05-16 09:24 GMT

దిశ, యాచారం : మండుటెండలతో చెరువు, కుంటలు ఎండిపోతూ… నేలలు నెర్రెలు బారి భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. కరువు చాయలు తరముకొస్తూ ఉండగా.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాల్సిన తరుణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని పాత మాల్, గ్రామంలో 5వ వార్డులో రోడ్డు పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ కి పెద్ద రంధ్రం ఏర్పడి గత 6 నెలలుగా త్రాగు నీరు వృధాగా పారుతుంది. నామమాత్రపు సరఫరాతో పాటు తాగునీరు వృధా అవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడి వాటర్ ట్యాంక్ కి మరమ్మత్తులు చేసి త్రాగునీటి వృధాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News