కానిస్టేబుల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి : ప్రజా, విద్యార్థి సంఘాలు

ఫిర్యాదు దారుడు పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పై దాడి చేసిన కానిస్టేబుల్ సత్తార్, ఎస్సై కాశీనాథ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2024-05-24 15:05 GMT

దిశ,తాండూరు : ఫిర్యాదు దారుడు పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పై దాడి చేసిన కానిస్టేబుల్ సత్తార్, ఎస్సై కాశీనాథ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ విద్యార్థి సంఘం నాయకుడి పై పట్టణ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు.

వివరలోకి వెళితే పట్టణంలో కొనసాగుతున్న ఓ ప్రైవేట్ టీవీఎస్ ఫైనాన్స్ సంస్థ లో పిడిఎస్యు విద్యార్థి సంఘ నాయకుడు శ్రీనివాస్తీ తీసుకున్న లోన్ విషయంలో తనకు న్యాయం జరుగలేదని చెల్లించిన కిస్తులను సైతం చెల్లించ లేదంటూ తనపై ఒత్తిడి చేస్తూ టార్చర్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నాయకుడు శ్రీనివాసపై అకారణంగా దాడి చేశారని తాండూర్ డి.ఎస్.పి బాలకృష్ణ రెడ్డి కలిసిన విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గురువారం సాయంత్రం పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ స్థానిక తాండూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వస్తే అకారణంగా బూతులు తిడుతూ , ఫిర్యాదు రాయనీయకుండా అడ్డుపడి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లిన కానిస్టేబుల్ సత్తార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థలో తీసుకొచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇలాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇలాంటి పరిణామాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతారణాన్ని దెబ్బతీస్తాయని, ప్రజలకు పోలీసులపై గౌరవం తగ్గిపోతుందని అన్నారు. శ్రీనివాస్‌ విషయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపి దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సత్తార్, దానిని ప్రోత్సహించిన ఎస్ఐ కాశినాథ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల్లో న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్, తెలంగాణ జన సమితి నాయకులు, కౌన్సిలర్ సోమశేఖర్ ,తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఎర్రన్ పల్లి శ్రీనివాస్, పి ఓ డబ్ల్యు జిల్లా నాయకులు గీతా మహేందర్, తదితరులు ఉన్నారు.

Similar News