సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో.. బీజేపీలో చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్లు

ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన దక్షత చూసి యావత్ దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

Update: 2024-04-30 07:49 GMT

దిశ, మీర్ పేట్: ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన దక్షత చూసి యావత్ దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో కమలం పార్టీలో చేరడం శుభపరిణామన్నారు. మంగళవారం జూబ్లీ హిల్స్‌లోని కొండా నివాసంలో మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ కార్పొరేషన్‌కు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇంఛార్జి అందెల శ్రీరాములు యాదవ్, మీర్ పేట్ అధ్యక్షుడు పెండ్యాల నరసింహ, మహిళా మోర్చా అధ్యక్షురాలు, కార్పొరేటర్ లీలా రవి నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు వేముల నరసింహ, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, జిల్లేల అరుణ ప్రభాకర్ రెడ్డి కో ఆప్షన్ సభ్యురాలు వేముల ఎల్లమ్మ, బీఆర్ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు ఇంద్రావత్ రవి నాయక్, కోండ్రు గౌరీ శంకర్, కొంతం విజయలక్ష్మి రాజు, జ్యోతి కిషోర్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు.

అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సాయంత్రం జరిగే రోడ్డు షోలో సీఎం రేవంత్ బడంగ్ పేట్, మీర్ పేట్ రోడ్డు వెడల్పు ఎంతో చెప్పి ర్యాలీ చేయాలన్నారు. కందుకూరు మండలం ఫార్మా సిటీపై కాంగ్రెస్ నేతల గందరగోళ ప్రకటనలతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీలో గ్రీన్ ఫార్మా విలేజెస్, మెగా టౌన్ షిప్స్, మెట్రో రైలు అంటూ ప్రకటనలు ఉదరగొట్టి అమలు చేయటంలో కాంగ్రెస్, నాటి బీఆర్ఎస్ సర్కారు విఫలం అయ్యాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, కన్వీనర్ ఎల్మేటి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలన్ శంకర్ రెడ్డి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Similar News