పాలమాకుల చెక్ పోస్ట్ వద్ద రూ.5.35 లక్షల నగదు పట్టివేత

ఎలాంటి పత్రాలు లేకుండా నగదును అక్రమంగా తరలిస్తున్న ఓ

Update: 2024-04-17 14:26 GMT

దిశ,శంషాబాద్ : ఎలాంటి పత్రాలు లేకుండా నగదును అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న నగదును సీజ్ చేశారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకుల చెక్ పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి పై పోలీస్ చెక్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది.

చెకింగ్లో భాగంగా బుధవారం హైదరాబాద్ వైపు నుండి మహబూబ్నగర్ వెళుతున్న నిషాన్ మైక్రో (TS 06 FF 7128) కారును ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించగా అందులో ఉన్న ఒక బ్యాగులో నగదు ఉన్నట్లు గుర్తించారు. కారు నడుపుతున్న ఈస రంజిత్ గౌడ్ అదుపులోకి తీసుకుని కారులో ఉన్నరూ. 5 లక్షల 35 వేల నగదును స్వాధీనం చేసుకొని విచారించారు. నగదుకు సంబంధించి అతని వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేనందున నగదును సీజ్ చేసి ఆర్డీవో కార్యాలయానికి అప్పగించడం జరిగింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News