ర‌న్నింగ్‌లో ఉన్న‌ కారులో మంట‌లు

నార్సింగ్ పీఎస్ పరిధిలో కారులో మంటలు చెలరేగాయి. టిప్ఖాన్పూల్ బ్రిడ్జి సమీపంలోని ఆర్మీ స్కూల్ దగ్గర రన్నింగ్ లో ఉన్న కియా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Update: 2024-05-22 12:11 GMT

దిశ, గండిపేట్ : నార్సింగ్ పీఎస్ పరిధిలో కారులో మంటలు చెలరేగాయి. టిప్ఖాన్పూల్ బ్రిడ్జి సమీపంలోని ఆర్మీ స్కూల్ దగ్గర రన్నింగ్ లో ఉన్న కియా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది గంటసేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి ప్రాణాపాయం జరగలేదని తెలిపారు. పూర్తి వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు.  

Similar News