తెలంగాణకు చల్లటి కబురు.. నేడు రేపు భారీ వర్ష సూచన

భానుడి భగ భగలకు చుక్కలు చూస్తున్న తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందింది. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోత, మండుటెండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో

Update: 2023-05-23 09:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భానుడి భగ భగలకు చుక్కలు చూస్తున్న తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందింది. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోత, మండుటెండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేడు రేపు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇక వాతావరణశాఖ కబురుతో రాష్ట్రప్రజలు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Tags:    

Similar News