Rahul Gandhi: కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి భేటీ ముగిసింది.

Update: 2023-06-26 10:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి భేటీ ముగిసింది. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అర్థగంటకు పైగా పొంగులేటి, జూపల్లితో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూలై 2వ తేదీన ఖమ్మం జిల్లాలో జరిగే సభకు రావాలని పొంగులేటి రాహుల్ గాంధీని ఆహ్వానించగా.. దీనికి ఆయన సానూకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను విడిచి వెళ్లిన నేతలంతా తిరిగి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘర్ వాపసీ జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అనే నినాదంతో నేతలంతా ముందు కెళ్లాలని ఈ సందర్భంగా నేతలకు రాహుల్ గాంధీ సూచించారు.

Tags:    

Similar News