ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి

కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

Update: 2024-05-23 04:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో మొత్తం 40 మందికి గాయాలు కాగా వారందరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ(13), గోవర్ధిని(8) మృతి చెందారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News